17 ఫిబ్ర, 2012

తన శివ తాండవం గురించి పుట్టపర్తి వారు.

అయ్య శివ తాండవం పై..
వఝ్ఝల రంగాచార్య గారు..
అధ్భుతమైన విశ్లేషణ చేసారు..
ఆయన ..
"పుట్టపర్తి వారి ఖండ కావ్యములు -పరిశీలన"

"శివ తాండవ ప్రత్యేకాధ్యయనము"
అనే సిధ్ధంత గ్రంధములు వ్రాసారు.
ఆయన కరీం నగర్ వాసి ప్రొఫెసర్..
 

"తాత్వికమైన దృష్టితో ఆలోచిస్తే.. 
శివ తాండవం ..
హరి హరా భేదాన్ని ..
అపూర్వమైన రీతిలో ఆవిష్కరించింది.
 

మంత్ర శాస్త్ర పరంగా ఆలోచిస్తే..
శివతాండవం..
నిత్య పారాయణ గ్రంధార్హతను కలిగి..

అధ్భుతమైన ..
ఆధ్యాత్మికానుభూతులు ప్రసాదిస్తుంది.
అందుకు ఈ రచయితే సాక్ష్యం.."
 

అని  తననే సాక్ష్యం గా చెప్పుకున్నారు..




ఇది 
సంగీత.. 
సాహిత్య ..
నాట్య ..
సమ్మేళనం గా..
కొనియాడ బడడమే కాక ..
న్యూరో పొయెట్రీ గా ..
విజ్ఞులు పేర్కొంటారు..

మహా కాల స్వరూపంగా..
మహా శ్వేత స్వరూపంగా ..
వర్ణించడం..
భౌతిక శాస్త్రంలో ప్రతిపాదించబడే..
బ్లాక్ హోల్ ను సంకేతిస్తూ వుంది..



దీనిలోనే మహా స్ఫోటం సంభవించి..
పునః సృష్టి ఏర్పడుతుందని..
భౌతిక తత్వ వేత్తలు అంటున్నారు.
ప్రమత్తునిలా శివుడు నర్తనం చేయటం ..
పరమాణు స్ఫోటముగా ..
ఇలా కావ్యం లో ..
నటరాజు వర్ణనం ..
లయ కాలాన్నీ ..
సృష్టి ఆవిర్భావాన్నీ..
సైతం సూచిస్తొందని డా. వఝ్ఝల రంగాచార్య గారు ప్రతిపాదించారు.


రంగా చార్యులు గారే కాదు ..
ప్రపంచ వ్యాప్తంగా ..
ఎందరో శివ తాండవం పై ..
పరిశోధన చేస్తున్నారు ..
చేస్తారు భవిష్యత్తులో కూడా..

ఎందుకంటే..
ఎందుకంటే..
ఎందుకంటే..
 

ఆయన తన ఉచ్చ్వాస నిశ్శ్వాసాలు కూడా
నారాయణ మంత్రాన్ని జపించడం..
ఆయన  ఉచ్చ్వాస నిశ్శ్వాసాలలో  కూడా ..

నారాయణ మంత్రమే నిండి వుంది...
ఆయన జీవితం నిండా వున్నవి రెండే ..
ఒకటి సాధన..

 రెండు శోధన .. 


ఆజన్మాంతము ..
కటిక దారిద్ర్యమైనా ..
అనుభవించగలను..
కానీ ..
క్షణమైనను..
నాస్తికత్వమును భరించలేనన్నారు.




తనను క్షణమైనా విడువ లేని..
తన వాణి కోసం ..
ఆ పరమ శివుడు..
సృష్టి రహస్యాలు తేట తెల్ల మయ్యేటట్లు..
ఖచ్చితంగా నర్తిస్తాడు..
శివతాండవంలో..
కానీ ..

నారాయణమూర్తి ఆత్మ లో ఆత్మ గా ..
జీవించిన అయ్య పట్ల..
 ఆ లక్ష్మీ మాత ఎందుకు శీత కన్ను వేసిందో..??
ఎన్నడూ వీడని ప్రశ్న..
బహుశా లక్ష్మీ విష్ణువుల కలహంలో..
పంతానికి పోయిన ఆ లోక జనని ..
అయ్యను పట్టించు కోలేదని అనుకోవాలేమో..!!


అందుకు తగ్గట్టుగానే అయ్య..
లౌకిక విషయాలకు..
అంత ప్రాధాన్యతనిచ్చేవారు కాదు.!!
అది ధనము కానీయండీ..

 మరేదైనా కానీయండి..!!
ఆయనకు చివరి దశలో డబ్బు విలువ తెలిసింది..
నాకొక రెండు వేలొస్తే బాగుండును ..
ఏదైనా ఆశ్రమంలో పోయి వుంటాను అని బాధపడ్డారు..




ప్రొద్దుటూరులో ..
అగస్తీశ్వర స్వామికి ..
ఎక్కువగా ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడిని. 

నాకు సాహిత్యం పిచ్చితో పాటూ ..
ఈ భక్తి పిచ్చి కూడా ఎక్కువగా వుంది ..
నన్ను ఎరిగిన నా స్నేహితులందరికీ కూడా తెలిసి విషయమే ఇది. 

ప్రొడ్దుటూరులో ..
అగస్తీశ్వర స్వామికి ప్రదక్షిణలు
చేస్తూ ..చేస్తూ ..
ఎందుకు పుట్టిందో ..
ఒకానొక రోజు ..
ఆ ప్రేరణ..
ఆ ప్రేరణతో ..
నలభై అయిదు రోజుల్లోనే ఈ శివతాండవం ముగించడం జరిగింది. 

తరువాత ఈ కావ్యం ఇంత చిన్నగా ఉందే..
దీన్ని స్వరూపం కాస్త పెద్దగా చేద్దాం..
దీనికి కాయ పుష్టి నిద్దాం ..
అని మళ్ళీ ఎంతగానో ప్రయత్నించాను..

కానీ మళ్ళీ ఆ ప్రేరణ నాకు రాలేదు.
అందువల్ల ఉన్నంతే చాల్లే అనుకున్నాను..!!
ఒక్కొక్క దానికి ..
బ్రహ్మాండమైన అదృష్టంపడుతుందేమో ..
నని నా ఊహ ..!!

భారత దేశమంతా ..
నేను సంపాదించుకున్నటువంటి కీర్తికి ..
ప్రధాన మూల స్థంభం..
శివతాండవమేమోననిపిస్తుంది..!

కాళిదాసు జీవితమే తీసుకుందాం..
నాటకాలు రాశాడు ..
కావ్యాలు రాసాడు..
పాపం ..
అయినా ఆ మేఘదూతకు వచ్చినటువంటి ప్రశస్తి..
ఇంకే కావ్యానికీ రాలేదు. 

రఘు వంశం ..
కుమార సంభవం ..
మంచివే అంటాము..
కానీ మేఘదూత మాత్రం ..
అతని అసాధారణమైనటువంటి రచన ..
అని అనుకుంటూ ఉంటాం.
అందుకే మల్లి నాధుడే చెప్పినాడు..
మాఘే మేఘే గతం భూయః 
మాఘ కావ్యం తోనూ.. మేఘ సందేశం తోనూ..
నా జీవితం గడిచిపోయిందీ ..అని ..
ఆ మేఘ సందేశం అంతా ..
ఇన్నూటా యాభై శ్లోకాలే.. ఉండేది. 
ఆ ఇన్నూటా యాభై శ్లోకాలతోనే..
కాళిదాసు మహాకవి అయిపోయాడు..

శివకవులు రగడ చందస్సులో ఎక్కువగా వ్రాసారు.. శివతాండవం లో ..
ఆ చందస్సునే ఎక్కువగా వాడటం జరిగింది.
చాలా మంది..
ఏదో ఊరికే ఏదో మాట్లాడుతూ వుంటారు..
మాత్రా చందస్సులు.. రగడలూ.. వ్రాయడం..
ఉత్పల మాల.. చంపక మాల..
వ్రాసే దానికి చేసే పరిశ్రమ కంటే ..
తక్కువేమీ కాదు.
 
పైగా ..
ఆ పద్యాలు వ్రాసేవానికి..
ఒక అనుకూలం కూడా వుంది.
మాత్రాచందస్సును వ్రాసే టప్పుడు..
వాడి మార్గాన్ని వాడే మలుచుకోవలసి వుంటుంది.
ఇదొక కష్ట మైనటువంటి పని కూడా..
 
ఆ చందస్సులు రాసే టటువంటి వాడు..
ఎంత సమర్థుడుగా వుండవలెనో ..
అంతకంటే సమర్థుడుగా వున్నవాడే..
మాత్రా చందస్సును సమర్థంగా..
పుష్టికరంగా వ్రాయగలడు ..
అని చెప్పేందుకే ఈ మాత్రాచందస్సులో..
నేను రచనలు చేసినానేమో అనిపిస్తుంది.

తెలుగు అస్సలు తెలియని ఇతర రాష్ట్రాలలో పర్యటించినప్పుడు..
అక్కడి సాహితీ మిత్రులు ..
శివతాండవం చదవమనేవారు.
భాష మీకు అర్థం కాదు కదా ..
అంటే భాష అవసరం లేదు ..
మీ గళం..
ఆ లయానుబధ్ధమైన శైలీ..
మా కేదో దివ్యానుభూతిని కలిగిస్తుంది అనేవారు