10 అక్టో, 2012

నేను చూసిన మహాత్ములు సామవేదం షణ్ముఖశర్మ







మా శ్రీశైలం గారు
మొన్న పది గంటలవేళ ఫోన్ చేసి
అమ్మా ఋషి పీఠంలో అయ్యగారి గురించి 
సామవేదం షణ్ముఖశర్మ గారి వ్యాసం వచ్చింది

చాలా రోజుల తరువాత 
నిన్న అనుకోకుండా లైబ్రరీకి వెళ్ళాను
పుస్తకాలు తిరగేస్తున్న నాకు 
ఆ వ్యాసం అనుకోకుండా కళ్ళబడింది

ఎంతబాగా వ్రాసారమ్మా 
పుట్టపర్తి వారి గురించి
నాకు కనుల నీరు ఆగలేదు 
అంటూ రుధ్ధ కంఠం తో 
అమ్మా అది మీకు ఇప్పుడే మైల్ చేస్తున్నాను
అని పంపారు

చదివిన నాకూ గుండె మూగవోయి
కళ్ళు జలపాతాలై
ఏదో వేదన పట్టి కుదిపేసింది

ఇలాంటి వ్యాసాలు
మా అయ్యగారిపై రావటం కొత్త కాదు 
కానీచదివిన ప్రతిసారీ
అయ్యో 
అంత మహితాత్ముని పోగొట్టుకున్నామే
అన్న పరితాపం

శరీరం శాశ్వతం కాదు
పుట్టిన తరువాత వెళ్ళిపోవలసిందే
కానీ 
మా మధ్యనే వుంటూ
ఆ భగవస్స్వరూపాన్ని కనుగొననీయక 
కప్పేసిన ఆ విష్ణుమాయ
ఏమని చెప్పను

అందుకే 
ప్రతిరోజూ
అష్టాక్షరి కృతులను టైప్ చేస్తూ
మండుతున్న మనసును 
చల్లార్చుకుంటున్నాను

ఆ కృతులు 
పుట్టపర్తి వారు 
స్వయంగా రాగాలను కూర్చినవి
హార్మోనియంపై వివశులై 

ఆలపించి ఆలపించి మైమరచినవి

ఆ గడ్డ మీదే అన్నమయ్య అవతరించాడు
ఆ గడ్డ మీదే మా పుట్టపర్తి పురివిప్పాడు