31 మార్చి, 2013

అవి అహోబిలం గుహలు ..





కప్పకి పాము శత్రువు ..
సిం హానికి  ఏనుగు శత్రువు ..
ముంగిస పాము శత్రువులు 
గ్రద్ద కోడి పిల్లల నెత్తుకు  పోతుంది 

జన్మ జన్మాంతర శత్రుత్వం ఉపాధుల మధ్య 
పులి మేకకు పాలిస్తే 
అది మరుసటి రోజు పేపరులో న్యూసు 
వాడెవడో చిట్ట చివర్లో ఉపాధిని గెలవటానికి 
ప్రయత్నం  జరిగింది 
పులిగా వుండగా ఏ మహాత్మ దర్శ నం  చేతనో 
అది తెలియ కుండానే ఆనందం పొందింది 
మనస్సు బాగుపడింది 

ఇది తెలియ కుండా 
వాటి మనస్సులో కూడా జరుగుతుంది 
వాటికీ మనసుం టుంది కదా 

సాయి బాబా మసీదులో వుండగా 
ఒక పులి మసీదులోకి వచ్చింది 
సాయిని చూ సిం ది . 
సాయి పులిని చూసారు.. 
అది చచ్చిపోయింది 

పులి లోపల అపార క్రౌర్యం నిండిన మనస్సు 
ఒక మహాను భావుని దర్శనంతో 
అపారమైన సత్వ గుణం లోకి వెళుతుంది 
ఇక ఆ ఉపాధిలో ఆ జీవుడు ఇమడలేదు 

తెలిసో తెలియకో మహాత్మ  దర్శ నం చేస్తే 
దానికి తెలియ కుండానే దాని క్రౌర్యం అణిగి పోతుంది 
ఆ ప్రకంపనలు 
అది క్రూర జంతువైనా 
దాని రజో గుణ తమో గుణ ప్రభావాలు తగ్గిపోతాయి 
అది వారి గొప్పదనం 

అవి అహోబిలం గుహలు ..
యువ పుట్టపర్తి ఒక గుహలో 
కనులు మూసుకుని ఏదో జపిస్తూ ..

అతనికి జీవితంపై ప్రేమ లేదు..
మరణం పై భయం లేదు ..
అప్పటికే 
కవిగా పండితునిగా తిరుగులేని పేరు ప్రతిష్టలు 
అతనికి కావలసిన దే మో 
అతనికి పరమాత్మకే తెలుసు 

పరమాత్మ ఇవ్వడు  
ఇతను ప్రయత్నం మానడు  .. 

అవి అహోబిలం గుహలు .. 
మనుష్య సంచారం లేదు 

బయట చండ ప్రచండంగా ఎండ 
నీటి గుక్క దొరికే దారి లేదు 
అయినా పుట్టపర్తికి వాటి విచారం లేదు 

పుట్టపర్తికి దాహమైతే 
పరమాత్మ నీటిని పట్టుకు వస్తాడు మరి... 
గుహలో అక్కడక్కడా అ ల్లుకున్న లతలు 
చిన్న చిన్న క్రిమి కీటకాలు 

పుట్టపర్తి పెదవులు  కదులు తున్నాయి 
శరీరం నిశ్చలంగా మనసు మరింత నిశ్చలంగా 

ఇంతలో ..
దగ్గరలో  పెద్దపులి గాండ్రింపు .. 
మళ్ళీ .. 
మళ్ళీ .. 
గాండ్రింపు .. 

ఇంకెవరికైనా గుండె లవిసి పోతాయి 
కొం దరికి గుండె లాగి పోతాయి 
పై ప్రాణాలు పైనే పోతాయి కొందరికి 

నెమ్మదిగా కళ్ళు తెరిచాడు పుట్టపర్తి 
ఎదురుగ పెద్ద పులి ..
అయిపోయింది ఇవ్వాళతో జీవితం క్లోస్ .. 
'పోనీలే ..
పులి చేతిలో చస్తే వచ్చే జన్మలో 
మహారాజుగా పుడతాం ..'
అనుకున్నాడు పుట్టపర్తి 

పులిని చూసాడు సూటిగా ..
పులీ పుట్టపర్తిని సూటి గా చూసింది ..
కొన్ని క్షణాలు గడిచాయి .. 

విచి త్రం .. 
పులి వెనుదిరిగి పోయింది మౌ నం గా..

శివ తాండవం కాసేట్






అక్కయ్య శివ తాండవం కాసేట్ చేసింది 

దానికి రక రకాల ఎఫెక్ట్ లను జో డి స్తూ ...
కాసేట్ రిలీజ్ కూడా 28 న 
దూరదర్శన్ కార్యక్రమం రోజునే జరిగింది 
ఎంత అద్భుతంగా ఉందంటే 
మా అయ్యా గొంతు విని
 నేను ఒక రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. 
"భగవంతుడా .. 
మా అయ్యా అమ్మ ల వంటి పుణ్య దంపతుల కడుపున పుట్టిం చావు 
నా జీవితాన్ని వారి పాదాల వద్ద పువ్వులా 
రాలి పడిపోయేలా చేయి 
నాకు వేరే కోరికలు ఏవీ లేవు .. " అని .. 
అక్కయ్య కు ఫోన్ చేసి చెప్పాను
' నీ జన్మ ధన్య మైందని..' 
ఇప్పటికైనా పుట్టపర్తి వారి గొంతు లో కాసేట్ రావడం 
నిజంగా సంతోషం 
పూర్తి శివతాండవం పాఠాన్ని 
అయ్య ఒక్క ఊపులొ చెప్పారు 
'కొంచం నీ బ్లాగులో పెట్టవే..' అంది అక్కయ్య 
వెల యాభై రూపాయలు 
పాపం దానికి పెట్టిన డబ్బు అయినా రావాలి కదా 
ఇప్పటికే దానింటి నిండా పుస్తకాలు నిండి పోయాయి 
ఇక శివతాండవం నృత్య రూపకము పై 
దృష్టి సారిస్తుంది అక్కయ్య 
ఆ నృత్య రూపకము కోసం 
ఎదురు చూస్తున్నాను నేను 
కడప లో ఉగ్గురప్ప అని ఒక డాక్టరు 
వారి పిల్లలు శ్యామల నాగ స్నేహితురాలు 
ఆ శ్యామల కూదా డాక్టరే 
ఆమె తన కూతురుతొ శివ తాండవం నృత్యం చేయించింది 
పుట్టపర్తి వారి వీధిలో మెమూ ఉన్నాము 
వారితో చనువుగా ఉన్నాము 
వారితో మాట్లాడాము 
వారి అమ్మాయిలతో స్నేహం చేసాము 
అవి వారి కమ్మటి జ్ఞాపకాలు 
ఆ ఆరాధనతో అమెరికాలో చదువుతున్న వారి అమ్మాయికి శాస్త్రీయ నృత్యం నేర్పించి పుట్టపర్తి వారి శివ తాండవం నృత్యం చేయించింది . 
మా కందరికీ ఫోన్ చేసి 
మీరు కడపకు రండి 
మా అమ్మాయి అయ్య శివతాండవం నృత్యం చేస్తుంది 
అని చెప్పింది కూడా 
కొందరు మంచినే చూస్తారు 
కొందరి కళ్ళను  చెడే ఆకర్షిస్తుంది 
అది వారి సంస్కారం 
ఆపైన ప్రాప్తం 
కంచి పరమాచార్యుల వారు నిత్య పారాయణం చేసారంటే 
నీకు కృష్ణ సాక్షాత్కారం చివరిదశలో అవుతుందని చెప్పారంటే 
అది సామాన్యమా ..??






29 మార్చి, 2013

"శ్రీనివాస ప్రబంధంలో పుట్టపర్తి కవితా వైదుష్యం" శ్రీ నరాల రామారెడ్డి పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ.



గిల్లుకోవోయి మెల మెల్ల గా చేయి జాచి ..

యువ పుట్టపర్తి



26 మార్చి, 2013


25 మార్చి, 2013

పుట్టపర్తి వారి శత జయంతి ఉత్సవాలు..







పుట్టపర్తి వారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి

కడపలోను హైదరాబాద్ లోనూ పెద్ద ఎత్తున.
మొదలు రవీంద్రభారతిలో అనుకున్న కార్యక్రమం 
నాగపద్మిని అధ్వర్యంలో దూరదర్శన్ సప్తగిరి లో 
రెండుగంటల లైవ్ ప్రోగ్రాం గా రూపుదిద్దుకోనుంది. 
అక్కయ్య ఆ పనిలో ఊపిరి సలుపుకోలేనంత బిజీ గా వుంది. 

దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి శైలజా సుమన్ 
రెండు గంటల లైవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో 
అక్కయ్య ఆనందం అయ్యపై దాని ప్రేమకు 
 ఒక అలంకారమయ్యింది. 

కడప నుంచీ పుట్టపర్తి వారి నిలువెత్తు ఫోటో పంపమని 
అక్కయ్యను ఒకటే ఫోన్ చేస్తున్నారట
దానికేమో తీరటం లేదు. 
అది నాకు పురమాయించింది. 
జానుమద్ది హనుమచ్చాస్త్రి గారింటికి 
 భూతపురి సుబ్రమణ్యం గారి కొడుకు గారికీ ఫోన్ చేసి 
పంపినట్లు చెప్పాను. 

అది బ్రౌన్ లైబ్రరీలో పెట్టాలట. 
నా బ్లాగు లోని అయ్య నిలువెత్తు ఫోటొ పంపాను. 
భూతపురి సుబ్రమణ్యం గారు మంచి కవి పండితులు. 
వారు మా ఇంటికి తరుచూ వచ్చే వారు. 
అయ్యంటే చాలా గౌరవం ఇష్టం.

వారి అబ్బాయికి నన్ను నేను పరిచయం చేసుకొని 
వారి తండ్రి గారితో నాకున్న పరిచయాన్ని 
పొందిన వాత్సల్యాన్నీ చెప్పాను. 
ఆయనా ఎంతో ఆనందపడ్డారు. 

వారి తండ్రి గారి తరుఫున
 ప్రతి సంవత్సరం ఒక కవి ని సత్కరిస్తున్నారట 
నా బ్లాగు చూడమని చెప్పాను 
వారు అప్పుడే చూసి 
నీ ప్రయత్నం చాలా మంచిదమ్మా. అని అన్నారు. 

కడప రేడియో స్టేషన్ డైరెక్టర్ గోపాల్ గారు 
నా అభ్యర్థన మీద కొన్ని పాటలు పంపారు భక్తి రంజనివి. 
ఫోన్ తరువాత మైలు చేసారు పాటలు చూసుకొమ్మని. 

నాకు పట్టరాని సంతోషం 
అయ్య కడప భక్తి రంజని పాటలు ఎలా దొరుకుతాయి.
ఎవరు సహాయం చేస్తారు అని తపించిన నాకు . 

ఆ కడప స్టేషన్ డైరెక్టరు చిన్నదాన్నయిన 
నా అభ్యర్థన మన్నించి పంపటం 
కలయో వైష్ణవ మాయయో కదా...
తీరా మైల్ చూసిన నాకు 
పాలపొంగుపై నీళ్ళు చిలకరించినట్లయింది. 
అవి అసలు అయ్య పాటలు కానేకావు. 
కొంచం దుఃఖం కొంచం నిరాశ. 

నువ్వు చూడవే అయ్య పాటలేమో నని అక్కయ్యకూ పంపాను. 
కానీ అది కూడా 
ఇవి విజయవాడ రిలే పాటలు. అని చప్పరించేసింది. 
అతనికి ఫోన్ చేసి 
అవి అసలు పుట్టపర్తి వారి పాటలు కావండి 
అని మెల్లగా చెప్పాను. 

అతనూ "పుట్టపర్తి వారివి కావా..?"
 అని దిగ్భ్రాతుడై 
"సరే.. మళ్ళీ వెతికిస్తాను...
 నీవు పాటల పల్లవులు వ్రాసి నాకు మళ్ళీ మైల్ చేయమ్మా.." అన్నాడు. 

ఇది ఈశ్వరుడు నాపై కురిపిస్తున్న దయో 
లేక మా అయ్యగారే చేయించుకుంటున్న పనో అర్థం కాలేదు. 
నిన్న నరసిమ్హాచారి  ఫోన్ చేసి 
అయ్య పాటలు కొన్ని  దొరికాయి అంటూ 
 శుభవార్త చెవినేసాడు. 

 కడప రేడియో స్టేషన్ వాళ్ళూ ఒక వారం రోజుల పాటు 
పుట్టపర్తి వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా 
ప్రతి రోజూ ఒక గంట సమయం 
పుట్టపర్తి వారి సూక్తి ముక్తావళి శివతాండవం 
ఇంకా పలు కార్య క్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. 

ఆ నరసిమ్హాచారి నేనూ కలిసి పనిచేసాం ఆకాశవాణిలో 
అతను నాకంటే హడావుడిగా వున్నాడు. 
"మా స్టేషన్ డైరెక్టర్ పేరు   సెలక్ట్ చేసారు.." అన్నాడు
" ఏంటి..?"
 అని అడిగా 
"సరస్వతీ పుత్రుని సాహిత్య వైభవం" అట. 

మీ కుటుంబ సభ్యులందరి నంబర్లూ ఇవ్వు త్వరగా 
అని తీసుకున్నాడు. 
"ఈ వారం రోజులూ అయ్యాక..
 భక్తి రంజని పాటలు నాకు వెతికి ఇవ్వాలి.." అన్నా..
" తప్పకుండా అనూరాధా..
పుట్టపర్తి వారికి నేనెంటే ఎంత ప్రేమో తెలుసా ..?
నన్ను కొడుకులా పలకరించేవాడు.." అన్నాడు. 
కృష్ణుడిని గోపికలందరూ నా వాడే అనుకున్నట్లు 
పుట్టపర్తి అందరి వాడూ .. 

ఇక శశిశ్రీ వ్రాసాలు సాక్షి సూర్య జ్యోతి దినపత్రికలలో పడ్డాయి. 
పొద్దుటే 6.30 కు శ్రీశైలం గారి ఫోన్ 
అమ్మా అమ్మా అయ్యగారి పై వ్యాసం జ్యోతిలో పడింది అంటూ.
శశిశ్రీ కి ఫోన్ చేసి పలుకరించా 
వ్యాసం బాగుంది 
అయ్య ఫోటో కొత్తగా వుంది అన్నా 
నేను గీయించానమ్మా అన్నాడు.

మీరు అయ్య కొడుకుగా పుట్టాల్సిందన్నా 
తప్పిపోయి ఎక్కడో పుట్టారు అంటే 
నేనూ అయ్య కొడుకునే లేమ్మా అన్నాడు. 

అన్నట్లు శశిశ్రీ నంబరుకు 
హోసూరు నుంచీ ఒకతను ఫోన్ చేశాడట. 
పుట్టపర్తి వారు పిట్ దొరసాని దగ్గర 
ఇంగ్లీషు చదువుకున్న రోజులలోని స్నేహితుడు 
ఎనభై వయసట.
 ఆ నంబరు కావాలని అడిగాను. 
ఆయన తర్వాత చేస్తానన్నాడు లేమ్మ 
మీకు నంబరు తప్పక ఇస్తాను అన్నాడు. 

ఇంకో విషయం 
శశిశ్రీ పుట్టపర్తి తండ్రి పేరును శ్రీనివాసులు గా మార్చారు. 
ఇంకా కొన్ని తప్పులు దొర్లాయి. 
కేంద్ర సాహిత్య అకాడమీ వారు 
పుట్టపర్తి మోనోగ్రఫీ శశిశ్రీ తో వ్రాయించారు. 
ఆ పుస్తకావిష్కరణా 28 నే అట.
బుక్ రిలీజ్ నాడే ఎనిమిది వందల పుస్తకాలకు 
బుక్ చేసుకున్నారని చెప్పాడు 

ఇక ఈ సంవత్సరమంతా అక్కడక్కడా పుట్టపర్తి శత జయంతి సభలు జరుగుతాయి.

నా ...






అవిగో ....!!!

23 మార్చి, 2013

నీవొక ధర్మ నిష్టు డని ...







ఇది కుడా ఆగ్నివీణ లోనిదే 

రచన మా అమ్మ కనకవల్లి 
అమ్మ రచనలలో యశోధర ,సీత ,కస్తూరి బా వంటి త్యాగ వనితలు తమ అంతరంగం తెలిపారు. అమ్మా వారివంటిదే కనుక వారి వాణిని తన కలాన వినిపించింది. 

లోకాపవాదానికి లోగి 
సీతాదేవిని .. 
గర్భవతిని.. 
అడవుల్లో విడిచినాడు ..
ఆమె  విషాద గానం 
గంగానదీ గర్భంలో  
ఇలా ప్రతిధ్వనించింది .. !!!
 ఉ . నీవొర్మ నిష్టు డని ..

       నీ చిరకీర్తి జగంబు..,పాడికో 
       బోవును.. ,భక్తీ భావ పరి 
       మూర్చితమై.. మరి..?? ధర్మ నిష్టలో 
       ప్రోవులు గాగ రాలిపడి 
       పోయిన.. మామక దగ్ధ జీవితా 
       శావిల భస్మ రాసుల వి 
       చారము లేరికిబట్టురా ప్రభూ..???
ఉ . చాకలివాని మాట కయి 

      సాధ్వి ననిందిత శీల నైన న 
      న్నా.. కఠినో గ్ర కాననము 
      లందు దొలంచుట ..! ధర్మ దృష్టి రా 
      జా ..! కృప ణ ము గాదు జన 
      కాత్మజ శీలము పృచ్చ సెయరా..!!
      నీకొక యాత్మయున్న గమ 
      నింపుము రా .. బదులేమీ వచ్చునొ..?
ఉ. రాముని ధర్మ పత్నికి ,  

     రణ్య ములన్ బడునాలుగేండ్లు  సా 
     ద్వీ మహితానువృ త్తి  గడి 
     దేరిన దానికి..,లంక నున్న నీ 
     ప్రేమకు.. నేక వేణి క 
     ధరించిన దానికి.. , నేటికిన్ నిరా
     శామిళి తంబు లూరుపులు.. 
     చాలునులే ..ఇక నేమి గావలెన్.. !!
క . నన్ను విదిచినావు గాని ..

     నిను విడువ గ లేదు నేను.. , నిర్మల గంగా 
     వని ని  ప్రతి కుసుమంబున.. 
     కనుగొంduదు  సుమ్ము..!!భావ కల్పితు గాగన్ ..!!
గీ. హృదయమే లేని రాముండు.. ప్రేమ మయిని 

    విడచి నాడు ..చాకలి వాని నుడుల కొగ్గి.. 
    హృదయ ముండిన సీత జీర్ణించు కొన్న 
    దాత్మ దుఃఖంబు , దయితుని యశము కొరకు......


22 మార్చి, 2013

"వేధ "





పాడుదునా ..




"మరణము"


ఒక దినము రాకుంటే ...????

అగ్ని వీణ కవితా ఖండిక 


20 మార్చి, 2013



ఇది పుట్టపర్తి వారితో దూరదర్శన్ హైదరాబాద్ తీసిన డాక్యుమెంటరీ




16 మార్చి, 2013

మాల లైన పూలు


మోచంపేట..
గుడిపాటి అవ్వ గారిల్లు..
ఇంటి బయట పెద్ద పెద్ద అరుగులు
చాపపై గుట్టగా పోసిన పూలు

 ఆడ వాళ్ళందరి తో కలిసి
తులజ ..కస్తూరి ..ఇందిర.. లలిత..
పూలమాలలు కడుతున్నారు
గుసగుసగా మాట్లాడుకుంటూ
ముసి ముసి నవ్వులతో  కలిపి పూలు మాలలవుతున్నాయి
ఆరోజు సాయంత్రం ఇంట్లో భజన
గురువారం

ఎందుకే అట్లా నవ్వుతున్నారు..
గదమాయించారు అయ్య

వయ్యారముగ రారా..
ఊ..
అందుకోండి
పల్లవి పాడి హుంకరించారు అయ్య

అయినా వాళ్ళ ముఖాలలో చిలిపితనాన్ని 
 ఎర్రవడ్డవారి చెక్కిళ్ళు దాచలేక పోయాయి
అందరూ కలిసి


"వయ్యారముగ గ రారా..
శ్రీ హరి.. వయ్యారముగ రారా.."

పాట 
ఆ పూలలో మధువును తాగిన తేటిలా
కొత్తగా హొయలు పోయింది..
పూమాల

లోపల   కృష్ణ చైతన్య ప్రభువు కంఠసీమను
అలంకరించి మురిసి పోయింది..