9 ఆగ, 2013

విద్వాన్ విశ్వం సూచన.. పుట్టపర్తి మేఘదూత రచన ..









ఎందుకోమరి, 
నారాయణాచార్యులు కొద్దికాలం విరక్తికి లోనైనారు. 
అప్పుడే వారికి అత్యంత ప్రీతిపాత్రమైన 
విజయనగర చరిత్రను 
తనదైన శైలిలో గ్రంథస్తం చేస్తూ 
 ప్రొద్దుటూరు సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నారు. 


1948-49 ప్రాంతంలో 
కుందూ నదికి వరదలు వచ్చాయి. 
వారి పర్ణ కుటీరం కూడా కుందూ ఆగ్రహానికి గురైంది. 


‘అస్త సామ్రాజ్యం’ అన్న కావ్యం వరద పాలైంది. 
పాత విరక్తికి కొత్త విరక్తి తోడైంది. 
కావ్యం కుందూ మింగేయడం 


ఆయనను బాగా బాధించింది. 


అప్పుడే 
విశ్వంగారు పుట్టపర్తివారిని కలుసుకున్నారు.
  ‘‘అప్పా! 
నాకెందుకో ఈ మధ్య పద్యరచన చేయాలంటే 
అచ్చుబాటు కావడం లేదు.


ప్రజల హృదయాల్లో నిలిచే 
కావ్య రచన చేయాలని ఉంది. 
దానికి తగ్గ వస్తువేదైనా ఒకటి సూచించు!’’ 
అన్నారట పుట్టపర్తి. 

‘‘స్వామీ! పద్యం కంటె 

మాత్రా ఛందస్సులో గేయ రచన 
అయితే బాగుంటుంది.’’ 
అంటూ మొదట రూపాన్ని సూచించి, 
తరువాతే 
తన దృష్టిలో ఉన్న ఒక వస్తువును కూడా 
నారాయణాచార్యులతో చర్చించారు విద్వాన్ విశ్వం. 

అదే ‘మేఘదూతము’గా 

తెలుగు సాహితీ వినీల వీధులలో విహరించింది. 
ఆచార్యుల వారి మేఘదూతము 
వారి అభ్యుదయ భావావేశానికి ప్రతీక. 
మానవతావాదాన్ని 
ఎలుగెత్తి చాటిన గొప్ప గేయకావ్యం.



కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి