5 సెప్టెం, 2013

తిరుప్పావై




తిరుప్పావై ఉపన్యాసాలు 
నల్లకుంట రామాలయంలో 1976 న జరిగాయి
గొప్ప వక్తగా పేరు గడించిన పుట్టపర్తి
శ్రీ వైష్ణవులకు ఎంతో ప్రీతిపాత్రమైన 
తిరుప్పావై ని హృదయంగమంగా చెప్పారు

దారిద్ర్యాన్ని భరించలేని ఒక భాగవతుడు 
స్పర్శచేతనే బంగారాన్నిగా వస్తువులను మార్చగలిగే 
ఒక మూలికను సంపాదించి 
స్పర్శ భాగవతుడుగా పేరు గడించాడట..

ఒకరోజు నామదేవుని ఇంటిలో 
నిత్యావసర వస్తువులు నిండుకున్నాయట
ఆయన శిష్యులు ఈ స్పర్శ భాగవతోత్తముని అరువడిగి 
ఆమూలికని తెచ్చుకున్నారు

విషయం విన్న నామదేవుడు కోపోద్రిక్తుడై
ఆ మూలికని బావిలో పారేశాడు
గగ్గోలు పెడుతూ వచ్చాడు దాని యజమాని

తుఛ్చమైన బంగారం కోసం 
బంగారం వంటి భక్తిని అమ్ముకున్నావు కదరా 
అని మందలించి
ఈ బావిలో ఎన్ని రాళ్ళు కావాలో ఏరుకో 
ప్రతిరాయీ బంగారమే అన్నాడట నామదేవుడు

అసలు భగవంతుని ప్రీతిని పొందడానికి 
దారిద్రయం ఒక అర్హతేమో
లేక 
భక్తులు భగవంతుని కోసం 
స్వఛ్చందంగా దారిద్ర్యాన్ని కౌగిలించుకున్నారో ..?

అందుకే 
ఎంత కావాలో అంతే సంపాదించి
అవసరాలకు సరిపడా వాడుకుని
మిగిలినదానిని  అతి తేలికగా వదిలి వేయగలగడం ఎవరికి సాధ్యం.. 


ఇది కేవలం ఒక ఉపకథ మాత్రమే..
ధనుర్మాసంలో తెల్లవారు ఝామున తిరుప్పావై 
పారాయణ చేయటం తమిళుల అయ్యంగార్లకు
మన తెలుగు వైష్ణవులకు ఆచారం

గోదాదేవి విష్ణువుని కీర్తిస్తూ తమిళంలో గానం చేసిన 
పాశురాలే ఈ "తిరుప్పవై"
పెళ్ళి కాని అమ్మాయిల చేత ఈ తిరుప్పావై పారాయణ చేయిస్తారు 
వైష్ణవులు శ్రీ మహావిష్ణువు వంటి భర్త దొరకాలని

సేకరణ శ్రీ రామావఝుల శ్రీశైలం 















కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి