11 జన, 2014

చీప్ ట్రిక్స్..కనికట్టువిద్యలు..

బుల్లిబాబా యెవరే అడిగింది ఫోన్ లో అక్కయ్య
అదేనే సుబ్బరాజు
ఆ.. వాడేనా..
తర్వాత్తర్వాత నేను హైదరాబాద్ నుంచీ కడప వచ్చేటప్పుడు ట్రైన్లో కూడా కనిపించి పలకరించాడే
అవునా..
ఆ..
మనింట్లో చాలా రోజులు వుణ్ణిన్నాడు కదా..
అవును
అప్పట్లో నేను ఆకాశవాణి నుంచీ డ్యూటీ ముగించుకొని సాయంత్రమింటికి వస్తే..
అక్క.. అక్కా నీకు రోజా పూలిస్తానక్కా.. అనేవాడు..
వద్దురా.. అంటే ..
తీసుకోక్కా.. అంటూ బలవంతంగా బుట్టలోంచీ ప్లాస్టిక్ గులాబీలు సృష్టించి ఇచ్చేవాడు..
అవునా..
ఆ..
 

అంటే వానికి అటువంటి గారడీ విద్యలన్నీ తెలుసన్నమాట..
అవునే.. బజార్లో కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు తర్వాత చూసానది
వాళ్ళు వాటిని అక్కడ ముట్టుకుని
తిరిగి అవే ఇంటికి వచ్చి సృస్టించగలరు..
ఇవన్నీ క్షుద్రోపాసనలు..
వాడు నాకు తిరుపతిలడ్డూ తినక్కా.. అని ఇచ్చాడు
నేను తిన్నానది..
నిజంగా బాగుంది..

ఇవన్నీ అయ్య చూసే ఇట్లాంటివి వద్దురా భవిష్యత్తుని పాడుచేస్తాయిటువంటి చీప్ ట్రిక్స్..
ముందు బాగ చదువుకో అని వాణితో చెప్పారు..
అంటే అయ్యకు ఇవన్నీ తెలుసన్నమాట..
కేరళలో ఇవి చూసి కొన్ని సాధన చేసి వచ్చారు కదా..
అవును..
వానిని ఎంత అశౌచంతో చేస్తే అంత తొందరగా ఫలిస్తాయట..
అంటే స్నానం చేయకుండా.. మల విసర్జన తరువాత శుభ్రం చేసుకోకుండా..అలా
 

నా చిన్నప్పుడు నల్ల దుప్పటి కప్పుకుని వచ్చేవాళ్ళు గారడీ వాళ్ళు
అయ్య వాళ్ళని పిలిచి యేదీ చేయరా అనేవారు సరదాగా..
 

వాళ్ళు గవ్వలు వెంట తెస్తారు..
ఒకసారి గవ్వలు నేల మీద విసరి
ఆ గవ్వలను పెద్ద పెద్ద తేళ్ళుగా మండ్ర గబ్బలుగా మార్చటం నేను చూసాను..
ఆ తేళ్ళ కొండీలను పట్టుకుని వాళ్ళు ఆడిస్తారు..
ఇప్పుడివన్నీ లేవుకదా..
అవును చేసేవాళ్ళు లేరు..
చెప్పినా నమ్మరు..
అసలు దేవుడే లేడంటూంటే..
 

అయ్య లత మాసపత్రికకు వ్రాసిన 
జీవితం అనుభవాలులో ఇలాంటివెన్నో చెప్పారు..
అయ్య వాళ్ళ బంధువొకాయన ..
ఒరే పిల్లలూ యేం తింటార్రా.. అనే వాడట..
చేతిని మంత్రించగానే సంచీ నిండా బొరుగులూ పప్పులూ వచ్చేవిట..

ఆ సంచికలే దొరకటం లేదు ఎంత ప్రయత్నించినా..