23 ఫిబ్ర, 2015

పలుకునో ముత్యాల పలుకులు జార












అది అడవి దారి
ఒక మేనా కదలిపోతూంది 
బోయీలు నిశ్శబ్దంగా నడుస్తున్నారు..
పలుచని వెన్నెల మసక మసకగా దారిని స్పష్టం చేస్తూంది..
 

అందులో వున్నది యెవరో కాదు 
త్యాగయ్య..
రామ భక్తి తత్పరుడు
అదేమిటీ త్యాగయ్య కడుపేదవాడుకదా..
 

మేనా సుఖం త్యాగయ్య కెలా
అది ఒక సంపన్నుని నివేదన
రామ కైంకర్యానికి ఆయన ధనమూఇచ్చాడు కొంత..
దారి దొంగల భయం  ఒకటి ఆరోజుల్లో
ఇది రాముని ధనం
మరి రక్షణా రామునిదే..
త్యాగయ్య ధైర్యం అదీ..
పల్లకిలో కూర్చుని..
ముందు వెనుక ఇరుప్రక్కల తోడై.. మురహర రారా.. అంటూ స్తుతించడం ప్రారంభించాడు
 

దారిలో దొంగలు రానే వచ్చారు
కొండపైనుండీ పెద్ద పెద్ద బండరాళ్ళను కిందకు దొర్లించి..
బోయీలను తరిమేయాలని చూశారు
కానీ
ఆ బండరాళ్ళను బాణాలు తుత్తునియలు చేస్తున్నాయి..
అవి వేస్తున్నది ఇద్దరు మనోహరులైన యువకులు
ఆహా యేమి వారి అందం
యేమి వారి తేజస్సు..
దొంగలు యీ సారి మరింత దగ్గరగా వచ్చారు..
మళ్ళీ ప్రయత్నించారు..
 

ఈసారి దగ్గరగా ఆ యువకులను చూశారు..మైమరచిపోయారు..
బాణాలు.. తగిలాయి వారికి
చంపేటంత కాదు కేవలం తరిమేటంత మాత్రమే..
అయినా వారు పారిపోలేదు..
మళ్ళీ మళ్ళీ వస్తూనే వున్నారు.. రాత్రంతా.
ఎందుకు..
ఆ ఇద్దరు ధనుర్ధారులను మళ్ళీ మళ్ళీ చూడడానికే..
తెల్లవారింది..
ఆ ఇద్దరు యువకులూమాయమయ్యారు..
అంతే దొంగలకు తీరని క్షోభ కలిగింది..
దుఃఖం ముంచుకొచ్చింది..
మళ్ళీ ఆ యువ కిశోరాలను చూడాలని 

మనసు తహ తహ లాడింది..
వారు దొంగలమని మరచిపోయ్యారు..
వారు పల్లకిని రక్షించారంటే
పల్లకిలోనివారు ఇంకెంత గొప్పవారో..
 

దొంగలు త్యాగయ్య కాళ్ళపై పడ్డారు..
వారిని యెవరు చూపిస్తారు..
'సామీ ..మాకేం వద్దు..

 ఆ ఇద్దరినీ ఇంకోసారి చూపించండి చాలు..'
అదీ వారి బాధ..
విన్న త్యాగయ్య నివ్వెరపోయారు
 

యేమిటీ..
ఇద్దరు ధనుర్ధారులు పల్లకిని కాపలాకాస్తూ
 రాత్రంతా వెనక నడిచారా..
త్యాగయ్య మనసులో బాధ సుళ్ళు తిరిగింది..
తాను 'రామా ..రామా..' అని పరితపిస్తున్నా 

తనకు కనిపించని రాముడు
యీ దొంగలకు దర్శనమిచ్చారా..
 

'అయ్యో.. రామయ్యా ..
నేను దొంగనైనా కాకపోతినే..
జన్మంతా తపస్సు చేసినా ..

ఒక్క క్షణం పాటు మనో నేత్రానికైనా లభించని 
ఆయన దర్శనాన్ని  రాత్రంతా తిలకించారా..
నేనెంత పాపిని..'

 అని కుమిలిపోయాడు..
 

తనను స్మరించే వారిని ఆ పరమాత్మ ఇలానే కాపాడతాడా..
నిజజీవితంలో మనకు అయాచితంగా లభించే సహాయాలు..
అనుకోకుండా దొరికే ఆధారాలూ ఇలాంటివేనా..
అవుననే అనుకోవాలి
కానీ మనం రాముడంటే బాణాలు పట్టుకుని నీలమేఘశ్యాముడైవస్తేనే గుర్తిస్తాం..

పుట్టపర్తి జీవితంలో ఇలా ఆ అష్టాక్షరి నాధుడు దాగుడు మూతలాడిన సందర్భాలేమైనా వున్నాయా..
 

అవును..వున్నాయి
పుట్టపర్తి కూడా త్యాగయ్య వంటివాడే
ఎవ్వరి కొలువూ చేయ ఇచ్చగించలేదు
ఎవ్వరి ప్రాపుకై పాకులాడలేదు
ధనాన్ని 'వినా దైన్యేన  లానే
జీవనమ్'

 లానే చూశాడు తప్ప పోగేసుకోలేదు..
 

త్యాగయ్య రామ నామాన్ని తొంభయ్యారు కోట్లు చేశాడు
పుట్టపర్తి అష్టాక్షరిని దాదాపు అంతే సాగించి 

ఆ అష్టాక్ష రినాధుని దర్శనాన్ని కాంక్షించాడు..
మరి ముందు వెనుక ఇరుప్రక్కలా ఆ క్రిష్ణయ్య లేకుండా యెలా వుంటాడు.


 ప్రియురాలు ప్రియునికై ఎదురు చూస్తూంది..
ప్రియుడు రాలేదు..
ఆమె అసహనం పెరిగిపోతుంది..
అతను వస్తే మాట్లాడదు
నవ్వినా నవ్వదు..
బ్రతిమాలినా కరుణించదు..
తానింతసేపూ పొందిన వేదన అతనికెలా అర్థమవ్వాలి..
అతని ఎడబాటు తననెంత దహించింది అతనికి తెలియద్దూ..
 

అలాంటి ప్రేమే యే బంధానిదైనా..
వాళ్ళే తన సర్వం అనుకొన్నప్పుడు
కోపం ప్రేమ విరహం ఆవేదన ఎలా ముప్పిరి గొంటాయో కదా..
 

పుట్టపర్తి తులసి దాసు భక్తుడు
మరి అతని రామునిప్రేమనెలా వర్ణించాడో చూద్దాం

ఒక్క విషయం నేనెంత ప్రయత్నించినా
గొంతు బొంగురును..
అపస్వరాలను
ఇంకా యేవేవో నాకు తెలియని లోపాలను అధిగమించలేకపోతున్నాను
కారణం
నేను సంగీతం సమగ్రంగా నేర్చుకోకపోవటమే..
నాఈ తప్పులను క్షమించి కేవలం
నా ప్రజంటేషన్ను ఆనందిస్తారని ఆశిస్తూ..
పుట్టపర్తి అనూరాధ.

14 ఫిబ్ర, 2015

ఉదాత్త చరితుని రామకథ








 

హరిహరాద్వైతము భారతమైనట్లు.. రామకృష్ణాద్వైతము భాగవతముగ దక్కుట మన భాగ్యము..
ఆ తపస్వి తెలుగు వారి ఇలవేల్పు..
తెన్గున నా యదృష్టము రామాయణమునకు బట్టలేదు..
అందుకే నాటినుండి నేటివరకు 'మేము.. మేమని' రామాయణమును వ్రాయుటకు ప్రతికవియు ముందుకు దూకుచున్నాడు..
కాని.. నా దృష్టిలో రామకథను వ్రాయవలసిన యుదాత్త చరిత్రుడింకను తెనుగున బుట్టవలసియున్నది..
ఇటుకలు.. గార.. ఈ రెండే యిల్లుగానట్లు..
చదువు.. ప్రతిభ మాత్రమే రామాయణమువంటి యుదాత్త కథకు సమగ్రమైన సామగ్రి కాదు..
తపస్సుతో బరిపక్వమైన కొంత యాత్మశక్తియును గావలెను..
కాని మనకు నేడిది బొత్తిగా నర్థముగాని మాట..
అర్థమైనను. అనవసర పరిశ్రమ..
"మహాభాగవతోపన్యాసములు"  పుట్టపర్తి