26 సెప్టెం, 2015

22 సెప్టెం, 2015

బాహుబలి



బాహుబలి చూశాను
మొదటిసారి చాలా బాగుందనిపించింది.
యుద్ధ సన్నివేశాలు భలే ఉన్నాయండీ 
మీరు చూడాలి అసలు .. అని 
మళ్ళీ మా ఆయన్ను లాక్కు పోయాను

ఆయన సాధారణంగా 
కత్తి యుధ్ధాలు 
భీకర పోరాటాలు 
పగ ప్రతీకారాలు వంటి కథనాల పట్ల ఇంట్రస్ట్ కలవారు

 ఆయన తాపీగా చూసి 
నేను చదివే నవల కన్నా గొప్పగా యేమీ లేదు
 అని తేల్చేశారు
ఆయన కొత్తగా కొన్న సన్న (smart) ఫోన్ లో 
తమిళ  నవలలు చదువుకుంటూ వుంటారు..

మా పిల్లలు ఎప్పుడూ సెల్ ఫోన్ పట్టుకుని 
యేవో నొక్కుతూ చూస్తూ 
అదో లోకంలో విహరిస్తుంటే 
ఈయనా వాళ్ళముందు పోజ్ కొట్టటానికి 


చారిత్రక కథలు ఆయనకిష్టం
అప్పుడప్పుడూ 
తాను రాజ రాజ చోళ అని చెబుతూ వుంటారు..
నేను నందిని అట అంటే విలన్ అన్నమాట..

ఇంక బాహుబలి కొస్తే..
ప్రభాస్ దూకుతున్న ప్రవాహపు కొండల పైకి చూస్తు వుండటం..
పైకి వెళ్ళటం 
అక్కడ తమన్నా తో ప్రేమ 
ఆమె ద్వార ఆ మాహిష్మతీ సామ్రాజ్జపు గొడవ లోకి ప్రవేశించటం..

ఆ రాజ్జం కట్టడాలు
చాలా బాగుంది
ప్రజలను హింసించడం 
.వారి సొత్తు లాక్కోవటం ద్వారా పాలకుల నైజం 
గ్రాఫిక్సో యేమో .. 
యేదైతేనేం మూడుగంటల కాలక్షేపం
యుధ్ధ సన్నివేశాలు బాగున్నాయి
విలన్ ప్రత్యేకంగా ఉన్నాడు

నిజంగా మన పూర్వ వైభవం అలానే వుండేది
మంచి కవిత్వం చెబితే 
మెడలోని రత్నాల హారాలు విసిరేవాళ్ళు రాజులు
తగవులు వస్తే 
ధర్మ ఘంట మోగించి న్యాయం కోరేవారు ప్రజలు

సంగీత నాట్యాలు వినోదాలు 
రాజులకి ..ప్రజలకి ..
హరికథలు ..పురాణ కాలక్షేపాలు.. 
ఒత్తిడుల నుంచీ దూరం చేసే సాధనాలు
కవులను కావ్యాల సృజనకు ప్రోత్సహించేవారు

ఒకరిపై మరొకరు యుక్తులు పన్ని 
రాజ్జాలు ఆక్రమించుకొనేవారు కొందరు..
తమ రాజ్జం అన్యాక్రాంతం కాకుండా 
అనేక రక్షణ మార్గాలు అనుసరించేవారు

విజయ నగర సామ్రాజ్జం  ఎలా వుండేది
చూడండి

''1379 ఒకానొక శాసనం 
విజయనగరము నిట్లు గీర్తించినది
అయోధ్యానగర మధ్యమున శ్రీరామ చంద్రుడు వసించినట్లు ..
విజయనారమున హరి హరుడున్నాడు

హేమకూటమే దాని ప్రాకారము..
తుంగభద్రా నదీమతల్లి 
యా మహాపట్టణమునకు గందకము.

మూడులోకములను బాలించు శ్రీవిరూపాక్షుడే 
దానికి రక్షకుడు
ఆ మహానగరమును బాలించు రాజరాజు రాజమనోహరుడు హరిహరుడు

దానిని వర్ణించుటకు మాటలు చాలవు
ఈ పట్టణము రెండవ స్వర్గము వలె నున్నది 
యని 'వర్తిమా ' పల్కులు

ఇట్టి పట్టణము నెవ్వరునుగని యుండరు.. 
విని యుండరు.. 
దీనితో సరితూగు నగర మీ భూమండలమున లేదని ''యబ్దుల్ రజాక్'' వ్రాసినాడు

విద్యానగ ర స్వరూపము గూడా 
బ్రాచీనాచార్యుల మతానుసారమే యుండెను
శు క్రుని మతమున 
నొక పట్టణమర్థ చంద్రాకారముగ నుండవచ్చును
ఈ రెండును గానిచో చచౌకమున నుండవలెను

'సీజర్ ఫ్రెడరిక్'  'రజాక్'
 ఇర్వురును గూడా నా మహా పట్టణము వలయాకారముననే యుండెనని సాక్ష్యమిచ్చినారు

ఆ రాజధాని 
విదేశీయుల  కనులు జిగేలు మనిపించినది
దాని చుట్టును రక్షణ సాధనము లెన్నియె యుండెను
ప్రతి మహాద్వారముకడనొక దేవతను ప్రతిష్టించి యుండిరి
నాడు ప్రతి గ్రామమున కొక్కొక్క గ్రా మదేవత యుండెడిది
మరి విజయనగరమున కెట్లు లేకపోవును..??

ఆ మహానగరము యొక్క రక్షణాధిదైవము 
రణమండల భైరవుడు
స్వామికి గృష్ణదేవరాయలొక దేవళము నిర్మించెను
మండపమును గట్టెను .. 
గ్రామ దేవత నేర్పాటు చేసినంత మాత్రమున 
నిక సర్వము నాతడే జూచుకొనును 'మాకేమి లెమ్మని' 
యా రాజు లు..  ప్రజలు..   చేతులు ముడుచుకుని 
కూర్చుండ లేదు .. 

సాహస శౌర్యము లతో దమ ధన మాన ప్రాణము లొసగి 
యా  మహా పట్టణము ను సంరక్షించు కొనిరి రణ  మండల భైరవ స్వామి .. 
వారి యుత్సహమునకు ప్రతీకము .. 
వారి త్యాగమునకు ప్రతీకము .. ''

ఇలా సాగిపోతుంది రచన 
ఇది పుట్టపర్తి వారి విజయనగర సామాజిక చరిత్ర యైన 
'మరపురాని మధుర గాధ' లోనిది 

పుట్టపర్తి విజయనగర చరిత్ర చెబుతుంటే 
బాహుబలి లాంటి పది సినిమాలు చూసినంత థ్రిల్ కలుగుతుంది 
కానీ అది కథ కాదు 
మన చరిత్ర 
మాన పూర్వ వైభవం 






విరహసుఖము

21 సెప్టెం, 2015

మళ యాళ మాయాజాలం




ఈయనే స్వాతి తిరుణాళ్ 

స్వాతి తిరునాళ్ రామవర్మ
తిరువాన్కూరు మహారాజు

ఈయన స్వాతీనక్షత్రంలో పుట్టినందువలన 
ఆ పేరు పెట్టారుట ఆయన తల్లిదండ్రులు

ఇటు పండితులవద్ద 
అటు సంగీత విద్వాంసులవద్ద శిష్యరికంచేసి రెండింటిలోనూ పరిపూర్ణత సాధించారు
అనంత పద్మనాభస్వామి వారిపై 
భక్తి మంజరి పేరున రచన చేశారు. 

ఇందులో అనంత పద్మనాభస్వామి వారి 
అపురూప సౌందర్యం
నవవిధభక్తి మార్గాలు
ఇలా మహత్తరంగా వర్ణింపబడ్డాయి
తిరువనంతపురంలోని స్వామి సన్నిధిలో 
ఈనాటికీ వీనిని వల్లిస్తుంటారట

త్యాగ రాజ స్వామి వారికి సమకాలికులైన 
స్వాతి తిరునాళ్ అతి చిన్న వయసులో  బ్రిటిష్ పాలకుల నిరంకుశ పద్ధతుల వలన మానసికంగా క్రుంగి పరమ పదిం చారు 
గొప్ప భక్తునిగా పరిపాలకునిగా మన్ననలు పొందిన 
ఈయన తన కృతులు ఈనాటికీ ఎందరో పాడుతుండగా 
మరణిం చారనటం  అసత్యమే కదా.. . 

పుట్టపర్తి స్వాతి తిరుణాల్  ను ఇలా పరిచయం చేస్తున్నారు .. 

సంస్కృతం లో కాశ్మీరు కెలాంటి ఘనత ఉందో .. 
కేరళ సాహిత్యంలో కూడా స్వాతి తిరునాళ్ కంతటి పే రు.. 
''వారి టెంకాయ నూనె లెంత స్నిగ్ధములో..  
వారి రచనలంత స్నిగ్ధశ్లక్ష్ణములు .. ''
అంటూ .. 
ప్రాచీనము నుండి మన కవులకు 
కే రళము పై మమత 
ఈనాడు మనము ప్రాంతీయ భేదాలతో వైషమ్యాలు కనపరుస్తున్నామని అన్నారు 
ఎప్పుడు ..?? 
ఎప్పుడో యాభై అరవైలలో 


 తెలుగులో చక్కని సాహిత్యం కలిగిన పద్యాన్ని ఆస్వాదిస్తూ .. 
కన్నడ వంటకాలు తింటూ .. 
కేరళ కొబ్బరి తోటలలో పడవ ప్రయాణం చేస్తూ ఉంటే అంతకన్నా స్వర్గమే ది ??'' అని సుబ్రమణ్య భారతి అంటే 
దానికి ఇంకో తమిళ కవి 
''మరి మన తమిళులవేం లేవా.. ??'' అన్నాడట 
''లేకేం .. 
వారి ఔన్నత్యాన్ని ఆస్వాదించే హృదయం ఉందిగా.. ''
అని  జవాబు .. 

నిజంగా ఎంత గొప్ప మనసు వారిది.. 
ఎంత చక్కని కళారాధన వారిది.. 

ఇవే కాదు .. 
కేరళ వంటలు 
కేరళ నృత్యాలు
కేరల అయ్యప్ప 
కేరళ చిప్స్ 
కేరళ ఆయుర్వేదం 
కేరళ వనితల కేశ సంపద 
ఇలా కేరళ ప్రత్యేకతలు చాలా వున్నాయి . . 



పరశురాముడు 
సముద్రాన్ని వెనక్కి పంపి కేరళను వెలికి తీశాడని పురాణగాధ.
కేరళ కేర అంటే కొబ్బరి అళం అంటే భూమి 
ఈ విధంగా కొబ్బరి చెట్ల భూమి గా ఒక వాదన
చేర .. అళం చేరుల భూమి అని మరొకటి


స్వాతి తిరునాళ్ రచనలు కొన్ని .. 










15 సెప్టెం, 2015

విశ్వనాధ జయంతి



విశ్వనాధ జయంతి సభను 
మన ఫేస్ బుక్ మిత్రులు
కస్తూరి మురళీ కృష్ణ గారు..  లక్ష్మి గారు  
తార్నాక లో నిర్వహించారు

సభలో శ్రీవల్లీ రాధిక గారు 
మనకు టీవీ చానల్స్ లో చక్కని మాటలు చెప్పే 
అనంత లక్ష్మి గారు తదితరులు మాట్లాడారు..
అక్కయ్యా నేనూ వెళ్ళాం..
అక్కయ్యను  కూడా మాట్లాడమని కస్తూరి గారు ఆహ్వానించారు.. ప్రిపేర్డ్ గా లేనంటూనే
 విశ్వనాధ .. పుట్టపర్తి గార్ల గురించి  నాలుగు మాటలు మాట్లాడింది

అనంతలక్ష్మి గారు మాట్లాడుతూ ఆమె పదహారేళ్ళప్రాయంలోనే విశ్వనాధ వారితో వేదిక పంచుకుని వారితో ఉక్కుపిండం అన్న ఆశీర్వాదం పొందానని..అదే తనకు ఇష్టమైన బిరుదని ఆవిడ అన్నారు..

మేం చాలా ఆలశ్యంగా వెళ్ళాం .. 
సభ దాదాపు ముగింపుకు వచ్చింది.

ఈ వీడియోలు మీకోసం..

పుట్టపర్తి వారి గురించి ఆనంత లక్ష్మి గారు 





11 సెప్టెం, 2015

స్నేహితుడు, విమర్శకుడూ

పుట్టపర్తి సాహితీ శిష్యుల్లో వల్లంపాటి ముఖ్యులు..
ఇప్పటికీ తమ గురువైన పుట్టపర్తిని గురించి 
వల్లంపాటి వ్రాసిన 
''నా స్మృతి మంటపంలో పుట్టపర్తి''
ని తమ స్మృతి మంటపాల్లో నిలుపుకున్న వారెందరో..
అలాంటి వల్లంపాటి గురించిన వ్యాసం 
''ఈమాట'' లో కనపడింది..

స్నేహితుడు, విమర్శకుడూ

ఈ వ్యాసం వ్రాసినది వేల్చేరు నారాయణరావు గారు..
ఆయన వ్రాసినది వల్లంపాటి పైన వారి గురు భక్తి పైన 
వేల్చేరు వారికి క్షమాపణలతో ఈ వ్యాసం ఉపయోగించుకుంటున్నాను..
అలానే ఈమాట వారికి కూడా కృతజ్ఞతలు..

స్నేహితుడు, విమర్శకుడూ

నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వల్లంపాటి వెంకట సుబ్బ య్య పోయారని. నిన్న మొన్ననే ఆయనతో చికాగోలో గంట ల తరబడి మాట్లాడాను. జంపాల చౌదరిగారి ఇంట్లో తెలుగు కథల గురించీ, తెలుగు విమర్శ గురించీ. ఆయన మాటలు, ఆయన గొంతుకా, ఆయన స్పష్టమైన ఆలోచనలు, విలక్షణమైన వాక్య ధోరణీ ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. పొద్దున్న పనిమీద ఢిల్లీ వచ్చిన నన్ను అఫ్సర్‌ హైదరాబాద్‌ నుంచి పిలిచి, మీకో విచారకరమైన వార్త చెప్పాల్సివొస్తోంది-అని ఒక్కఅరక్షణం గడవకముందే వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు పోయారని అనగానే నేను నిర్ఘాంతపోయి ‘నిజమా’ అనడం గుర్తుంది కాని ఇప్పటికీ ఆ మాట నిజంలా వినిపించడం లేదు.
ఏదైనా వూహ కొస్తే, ఒక కథ గురించో, ఒక విమర్శా సిద్ధాంతం గురించో ఒక ఆలోచన వొస్తే అది వల్లంపాటి వినాలని, ఆయ న ఏమంటారో తెలుసుకోవాలని చటుక్కు న అనిపించేది. వెంకటసుబ్బయ్యగారు ఎ ప్పుడూ అందుబాటులో ఉండేవారుకారు. ఎక్కడో విసిరిపారేసినట్లు ఆ మూల వున్నారెందుకూ, ఆంధ్రదేశంలో ఏ విశ్వ విద్యాలయమూ అయన్ని పిలిచి ఎందుకు ఉద్యో గం ఇవ్వలేదెందుకు- అని చాలా సార్లు నా లోపల విసుక్కునేవాణ్ని. ఆయనకి అంతకన్నా దూరంగా నేను అమెరికాలో విస్కాన్సిస్‌లో ఉన్న మాడిసన్‌ వెళ్లిపోయాక విచిత్రంగా ఆయన దగ్గిరయ్యారు. రాత్రీ, పగలూ అనకుండా టెలిఫోన్‌ లో మాట్లాడ్డానికి వీలుదొరికేది. మరీముఖ్యంగా ఆయన కథా శిల్పం మీదా, విమర్శా సిద్ధాంతాల మీదా రాసిన పుస్తకం వచ్చిన తరవాత- ఆయనతో చాలాసార్లు వివరంగా మాట్లాడాను. మాట్లాడే విషయం లో గాఢతకీ, ఆ మాట్లాడే తీరుకీ ముచ్చటపడుతూ మాట్లాడాను.
తెలుగుకథకి ఉన్న సామాజిక స్వభావాన్ని ఆయన ఎంతో స్పష్టం గా, విమర్శయుతంగా పట్టుకున్నారు. కథ సామాజిక పురోగమన ధర్మాన్ని నెరవేర్చాలని ఆయన బలంగానమ్మారు. తెలుగు కథా విమర్శని గట్టి సిద్ధాంత పునాదుల మీద నిర్మించిన ప్రత్యేకత ఆయనదే. కథ చదివి అందులో విషయాన్ని తిరిగి చెప్పి అది సామాజిక ప్రయోజనం నెరవేరుస్తోందనే మాట పడికట్టుపదాలతో ఉద్ఘాటం చేసే విమర్శల ధోరణిని మొదటిసారిగా మార్చి, తెలుగుకథారూపాన్ని, దాని శిల్పాన్ని తాత్విక పునాదుల మీద నిలబెట్టిన వాడు వల్లంపాటి.
మార్కిస్టు సిద్ధాంతం మీద విశ్వాసం పోగొట్టుకోకుండా, సాహిత్య రూపాల మీద శ్రద్ద పెట్టిన చాలా కొద్ది మంది విమర్శకుల్లో ఆయన ఒకరు. సాహిత్య విమర్శంటే రాజకీయ ఉపన్యాసమే అయిపోయిన ఈ రోజుల్లో – సాహిత్య రూపం మీద దృష్టితో, ఆలోచనాత్మకంగా, విశ్లేషణ సామర్థ్యంతో కథని, కథాకథన మార్గాన్ని, కథా నిర్మాణాన్ని సిద్ధాంతీకరించిన విమర్శకుడు వల్లంపాటి.
ఇంగ్లీషులో ఉన్న సాహిత్య విమర్శని అది పొందిన వివిధ పరిణామాలతో చారిత్రక దృక్పథంతో బోధపరచుకున్న చాలా కొద్దిమంది తెలుగు విమర్శకుల్లో వల్లంపాటి ఒకరు. దానికి తోడుగా- తెలుగు సాహిత్యంతో మొదలుపెట్టి, ఆధునిక సాహిత్యం దాకా శ్రద్దగా చదివి న ప్రత్యేకత ఆయనది. మాటలు దొర్లించడానికీ, డొల్ల పొగడ్తలు పొగడడానికీ, పెద్ద ఆలోచన అక్కర్లేకుండా ప్రా చ్య పాశ్చాత్య విమర్శకుల పేర్లు గాలిలో కబుర్లలా ఉదాహరించే వాతావారణంలో ఆయన చదివిన చదువుని గమనించి ఆయ న చేసిన పనిని కొనసాగించే కొత్త విమర్శకు లు ఎక్కడైనా ఉన్నారా అని వెతుకుతుండే నాకు- ఆయన పోయారనే కబురు ఒక స్నే హితుడు పోయారనే నొప్పి కలిగించడంతో పాటు ఒక విమర్శ సంప్రదాయం బలంగా ఏర్పడకముందే ఆ సంప్రదాయ ప్రవర్తకు డు తెరమరుగయ్యాడే అనే నిరాశ కలిగించి దిక్కుతోచకుండా చేస్తోంది.
ఆధునికంగా వొస్తున్న మార్పుల వల్ల, ప్రపంచీకరణ వల్ల కలుగుతున్న చవకబారు లాభాలవల్ల తన సాంస్క­ృతిక స్థైర్యాన్నీ, నిలకడనీ, ఉనికినీ గబగబా పోగొట్టేసుకుని ఒక డొల్లబారిన సంకర సంస్క­ృతిని చేతులారా కావిలించుకోడానికి తహతహలాడుతున్న ఈనాటి నాగరిక యువతరం కన్నా ‘వెనకబడిన’ రాయలసీమలో ఇంకా వేళ్లూనిన సాహిత్యసంస్క­ృతి ఉందని గమనించి దానిని వివరించిన ప్రత్యేకత వల్లంపాటిది.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వల్లంపాటి సాహిత్య గురువులు. ఆ మహా పండితుడి సాహచర్యంలో తెలుగూ, సంస్క­ృతమూ, కన్నడమూ చదివి, ఆ సాహిత్యాలలో ఉండే బలాన్ని తెలుసుకుని, దాన్ని ఆధుని క విమర్శ చైతన్యంతో విశ్లేషించి, అనుసరించిన విశేష ప్రజ్ఞావంతుడు వల్లంపాటి. పుట్టపర్తి నారాయణాచార్యులుగారిని గురించి వల్లంపా టి మాట్లాడుతుంటే, ఆయన కళ్లల్లో వెలుగూ, ఆ గొంతుకలో మెచ్చుకోలూ నన్ను అచ్చమైన తెలివితేటల్లాగా చకచ్చకితం చేసేవి. పుట్టప ర్తి వారిని గురించి వల్లంపాటి మాటలు మళ్లామళ్లా వినాలని ఎదురుచూసేవాణ్ణి. కాని ఇంత మెచ్చుకోలుతోనూ వల్లంపాటి పుట్టపర్తి వారిని సవిమర్శకంగా చూడడం మానలేదు. వల్లంపాటి ఎవరికీ ఆరాధకుడు కాలేదు. తన విమర్శ దృక్పథాన్ని ఎప్పుడూ వొదులుకోలేదు.
నన్ను ఎప్పటికీ వొదలని నిరాశ ఏమిటంటే, అటు పుట్టపర్తి వారి పాండిత్యాన్నీ మనం పూర్తిగా వినియోగించుకోలేదు. దానిని వినియోగించుకుని అందువల్ల పరిణతి పొందిన వల్లంపాటినీ మనం పూర్తిగా వినియోగించుకోలేదే అని. వల్లంపాటి రాసినది తక్కువేమీ కాదు. కాని రాయగలిగింది, అవకాశాలు సరిగా ఉంటే రాసి ఉండేది ఇంకా చాలా ఎక్కువ.
వల్లంపాటి ఏ విశ్వవిద్యాలయంలోనో మంచిస్థానంలో ఉంటే, తన దగ్గర చురుకైన విద్యార్థులు తయారయివుండేవారు. తనదైన ఒక ఆలోచనామార్గాన్ని, ఒక కథా విమర్శ సంప్రదాయాన్ని నిండు గా నిలబెట్టివుండేవాడు. ఆ అవకాశం ఆయనకు కల్పించే సాహిత్య వైజ్ఞానిక రంగం మనకి ఏర్పడలేదు. ఆయనే అలాంటి రంగాన్ని ఏర్పరచగలవాడు. కానీ ఆ పని ముగియకముందే వల్లంపాటి వెళ్లిపోయారు.
తెలుగులో కవిత్వాన్ని గురించి ఆలోచించిన వాళ్లూ, విమర్శలు రాసిన వాళ్లూ చాలా మంది ఉన్నారు. కాని కథని పట్టించుకున్న విమర్శకులు లేరని అనుకునేవాణ్ణి. ఆధునిక తెలుగు సాహిత్య ప్రపం చంలో కథకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి వల్లంపాటి చేసిన పని చూసి ఇది మరికొందరు అంది పుచ్చుకుంటారనే నమ్మకం కలిగింది.
కాని వల్లంపాటితో చర్చించవలసినవి నాకు చాలా ఉన్నాయి. రాజకీయ సిద్ధాంతానికీ, కథా ప్రాణానికీ ఉన్న సంబంధం గురించి మరీ మాట్లాడాలనుకునేవాణ్ణి. విమర్శ ఎంత తీవ్రమయినదయినా, ఆవేశ పడకుండా విని, సరళంగా, ఓపిగ్గా, సహేతుకంగా చర్చించగలిగిన ఆయనతో ఎలాంటి అభిప్రాయమైనా, సంకోచించకుండా చర్చించడానికి వీలుండేది. ఇంకా ఎన్ని ఉన్నాయో మాట్లాడడానికీ, ఆయనతో పోట్లాడడానికీ. కానీ ఈ లోపునే ఆయన వెళ్లిపోయారు.
చికాగోలో ఆయనతో ఎడతెరిపి లేకుండా చెప్పిన కబుర్లలో రెండు పెద్ద మేడలు కట్టాము. ఒకటి – తెలుగు కథల్లో మంచి కథలు కూర్చి ఒక ప్రపంచస్థాయికి రాగలిగిన సంపుటిని తయారుచేసి, దాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచవ్యాప్తం అయేలా ప్రచురిద్దామని. మంచి కథలు అంటే నిజంగా మంచి కథలే. వాటి సాహిత్య స్థాయి తప్ప మరే మినహాయింపు లేకుండా నిక్కచ్చిగా మంచి కథలే ఎంచుకుం దామనీ, ఆ సంపుటికి బలమైన విమర్శతో కూడిన ముందు మాట రాద్దామనీ. ఇది ఒక మేడ. ఈ మేడ గురించి ఇంకొంచెం చెప్పాలి.
తెలుగులో ప్రస్తుతం బలంగా వీస్తున్న రాజకీయ, సామాజిక, ప్రాంతీయతా ధోరణుల బలమైన గాలులు మా కథా సంపుటిలో కథ ల ఎంపికకి బలాన్ని ఇవ్వాలే గాని, ఆటంకాలు కాకూడదని ఇద్దర మూ ఒప్పుకున్నాం. తనకున్న కథానుభవాన్ని, కథాభిరుచినీ ఈ ప్రయత్నంలో జోడించడానికి జంపాల చౌదరిగారు, అంతకుముందే నవీన్‌ అంగీకరించారు. ఈ పనిలో – దూరంగా కూర్చున్న నా బోటివాడు చెయ్యగలిగినది ఎక్కువ కాదనీ, ఇందులో చాలా మంది అనుభవాలు కలవారనీ నేను మరీమరీ పట్టుబట్టాను. అప్పటికప్పుడు కూర్చుని రాత్రి చాలాసేపు అయేదాక వల్లంపాటీ, జంపాలగారూ, నేను ఓ కథల జాబితా తయారు చెయ్యడం మొదలుపెట్టాం కూడా. ఇలా మాట్లాడేటప్పుడు ఫలానా కథ ఎందుకు మంచిదో వల్లంపాటి విశ్లేషిస్తుంటే నేను టైముసంగతి మరిచిపోయి వింటూ కూర్చున్నాను.
ఇకపోతే, తెలుగు కథాకథన సంస్క­ృతి ఒకటి ప్రత్యేకంగా ఉందా, లేకపోతే ప్రపంచంలో ఉన్న కథల సముద్రంలో తెలుగు కథ కాకి రెట్టలా కలిసిపోతుందా అని ప్రశ్న వేసుకుని తెలుగులో కథ చెప్పే విధానాలని పేదరాసి పెద్దమ్మ కథలనించి కుప్పిలి పద్మ కథల దాకా, పింగళి సూరన కావ్యాల లాంటి నవలల నుంచి కేతు విశ్వనాథ రెడ్డి కథల దాకా అన్ని విశేష కథనా రీతుల్నీ చూసి విశ్లేషించి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలమా? తెలుగు కథాకథన సంప్రదా యం/విధానం సిద్ధాంతీకరించాలి. దానిమీద ఒక గోష్ఠి, ఒక చర్చ నడిపి ఒక మంచి పుస్తకం రాయాలి. ఇది మేం కట్టిన రెండో మేడ.
ఈ రెండు మేడలూ కబుర్లతో కట్టినవే. కాని ఆ క బుర్ల వొట్టి గాలి కబుర్ల కావు. వల్లంపాటితో ఏం మాట్లాడినా అవి గాలికిపోయే కబుర్ల కావు. ఆ కబుర్ల మేడలు అక్షరాల సౌధాలు అవకముందే వల్లంపాటి కన్నుమూశాడు. కానీ ఆ కబుర్ల పునాదులు నా మనస్సులో లోతుగా ఉన్నాయి.
ఈ రాత్రంతా ఢిల్లీలో ఉన్న నాకు నిద్రపట్టకుండా మనస్సు నిండా ఆ కబుర్లు ఆవరించుకుని ఉన్నాయి.
(ఆంద్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)
రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌ లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌ గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాసారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని(Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు గారు ప్రస్తుతం ఎమరి యూనివర్సిటీ లో పనిచేస్తున్నారు. ... 

5 సెప్టెం, 2015

3 సెప్టెం, 2015

నేను పాడిన పుట్టపర్తి కృతులు.. వేదవతి ప్రభాకర్..



చిన్న కూనను పెంచి పెంచి పెద్ద చేస్తే..
అది ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది
పాటలు పాడుతుంది
మాటలు చెబుతుంది
యేం చేసినా అపురూపమే
తన ప్రాణం తన ఎదురుగా నిలిచినట్లు
తన ఆశలు ఊపిరి పోసుకున్నట్లు
తను ఒక్క క్షణం కనిపించకున్నా ఆదుర్దా..
ఆశరీరానికో మనసుకో గాయమైతే  
ఇక్కడ రక్తం స్రవిస్తుంది
ఆ బంగారం మరో ఇంటికి వెళ్ళిపోతుందంటే
యేమవుతుంది..??
అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా..
అని దిగులు చెందుతుంది హృదయం
ఈ పాట రేడియోలో ప్రసారమవుతున్న రోజుల్లో 
పరవశించని  వారు లేరంటే అతిశయోక్తి కాదు
అసలీపాటను పాలగుమ్మిగారు 
వారి అమ్మాయి కోసం వ్రాసుకున్నారం ట 

నా పెళ్ళి నిశ్చయమైన తరువాత 
మా అయ్య పొందిన బాధ వర్ణనాతీతం..
నేనే చివరి బంధం మా అయ్యకు..
దీని బాధ్యత మీదే ..
అని మా అమ్మ పదే పదే మా అయ్యని హెచ్చరించి వెళ్ళిపోయింది..
మిగతా పిల్లలందరి గురించీ అయ్య పట్టించుకోనేలేదు..
అందుకని
అయ్య ఆ శ్రీనివాసుని  కప్పగించారు..
అమ్మ తన రామునికప్పగించింది..
అందుకే నేనీ రోజు సుఖంగా ఉన్నాను..

వేదవతి ప్రభాకర్ గారు
ఇదే కాదు ఎన్నో గీతాలకు ప్రాణం పోసారు
సాహిత్యం వల్ల గాత్రానికి గాత్రం వల్ల సంగీతానికి అద్భుతమైన మైత్రి కుదిరింది
అందుకే ఆ సృష్టి శాశ్వతమైంది


వేదవతి గారు కర్నాటక ప్రాంతం వారు
ప్రభాకర్ గారు అనంతపురం వారు కలెక్టర్ గా పదవి . . 
పుట్టపర్తి ఆరాధకులు

ఆకాశవాణిలో పాటలు పాడటమూ ..
ఇంట్లో భర్త అత్త మామలు 
పుట్టపర్తిని గురించి గొప్పగా చెప్పడమూ
ఆమె పుట్టపర్తి భక్తి రంజని కృతులను
 తాదాత్మ్యతచెంది పాడేందుకు దోహదమయ్యాయి..
ఆమె పాటలెంత మధురాలో 
ఆమె మాటలు కూడా అంతే మధురాలు

పుట్టపర్తి వారి కృతులు వేదవతి స్వరంలో 
యమునా తటిలో తిరిగెడి వాడట .. 
ఉప్పొంగకువె యమున
రాసము లప్పు డాడిరీ ..

ఇవి కొన్నే దొరకనివి చాలా వున్నాయి 
కడప రేడియో స్టేషన్ లోనూ 
అద్భుతమైన కృతులు న్నాయి 
కానీ 
అవి బయటికి వచ్చే మార్గమే తెలియటం లేదు 

వేదవతి గారు పాడిన ఇతర పాటలు 
ప్రియసఖీ శ్రీహరికి దయలేదు నా పైన 
శివ పాదములుంచ నేను .. 
పూవులేవి తేవే చెలి.. 
అమ్మ దొంగా నిన్ను నేను వేసే ప్రతి అడుగుకు పునాది మా అక్కయ్యదే.. 
ఎవరన్నా పుట్టపర్తిపై కృషి  చేస్తామంటే 
తనకు చేతనైనంత సహాయం చేయటం 
అక్కయ్య ఆనందం  ..