28 నవం, 2015

హృదయమె సంకెల యౌ నా ..??


న గురోరధికం ..


న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః 
న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః
గురువును మించిన తత్త్వం లేదుగురువును మించిన తపం లేదుగురువును మించిన జ్ఞానమూ లేదుఅట్టి గురుదేవులకు నమస్కారము.

శంకరాచార్యులవద్ద పద్మపాదాచార్యులనే శిష్యుడు
గురువు మాటే వేదవాక్కు
గురువే దైవం
తోటి శిష్యులకు అసూయ..

వారికి కనువిప్పు కలిగించాలని 
శంకరాచార్యులవారనుకున్నారు.

ఒకసారి సనందుని రమ్మని కబురంపారు
నదికటువైపునుంచీ..
ఇటువేపున ఉన్న శిష్యుడు పరుగు పరుగున వెళ్ళాడు.
నడుమ ఉరకలేస్తున్న నదిపైన
డాటడం ఎలా అన్న ప్రశ్న లేదు..
వేస్తున్న ప్రతి అడుగు కిందనుంచీ 
ఒక పద్మం వికసించింది..
ఆ పద్మాలపై నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇతర శిష్యులకు తమకు అతనికి ఉన్న భేదం చక్కగా 

గోచరమైంది..

ఇలా గురు చరితలు మనకనేకం . . 
మన మనసులో ముద్ర వేసిన వానిని మనం 
అప్పుడప్పుడూ వాడుతుంటాం .. 

ఒకసారి కేతు విశ్వనాధ రెడ్డి గారూ
శశిశ్రీ గారూ ఇద్దరూ ఒక దేవాలయం వెళ్ళారు..
అక్కడి పూజారి 
శశిశ్రీ ని గోత్రం చెప్పమని అడిగారట..
శశిశ్రీ తడుముకోకుండా భారద్వాజసగోత్రం అన్నాడట..
ఆశ్చర్యపోయిన కేతు గారు..
శశిశ్రీ నీవు ముస్లిం వి కదా 
మరి నీ గోత్రం భారద్వాజస అన్నావెందుకు 
అని అడిగారు
నేను పుట్టపర్తి నారాయణా చార్యుల శిష్యుడిని 
నా గురువు పుట్టపర్తి నారాయణాచార్యులదే గోత్రమైతే 
నాదీ అదే గోత్రం 
అని చిరునవ్వుతో జవాబిచ్చారట శశిశ్రీ..
ఈ  విషయం 
కడప ఇన్ఫో లో త్రివిక్రమ్ గారు ప్రస్థావిం చారు
వాస్తవానికి పుట్టపర్తిది షటమర్షణ గోత్రం.
కానీ గురువు గోత్రమే తన గోత్రం అంటం చక్కగా వుంది
దానిద్వారా  గురువుతో ఎంత 
 మానసిక బంధం ఏర్పరుచుకున్నారో తెలుస్తుంది.
ఆ బంధం గురువే వేస్తాడో లేక 
 ఆయన తపోబలమే శిష్యుడిని కట్టిపడేస్తుందో.. 
శిష్యుడే తన భక్తితో గురువును పొందుతాడో..
అదంతా అలౌకిక ప్రపంచం 
కానీ గురువుగా ఒకరిపై గురి కుదరటం
 అందరికీ సాధ్యం కాదు 
దానికి కూడా ప్రాప్తం ఉండాలి 
దానిలో ప్రయాణం అతి దుర్గమం
బయలుదేరి వెళ్ళినవారు 
తమ అనుభవాలను మనతో పంచుకోరు..
కావాలంటే నీవూ వచ్చి చూడు అంటారు..
అంత అతిలోకమైన భావ ప్రాప్తి పొందిన తరువాత 

ప్రపంచం వేపుచూస్తారా..