12 జులై, 2016

బధిరన విలాపం

చెవుడు..
ఎవరు చెప్పిన మాటా వినపడద..
పదే పదే అడిగితే విసుక్కుంటారు..
ఎదురుగానే యేమేమో మాట్లాడుకుంటారు..

అప్పుడప్పుడూ పెద్దగా నవ్వుకుంటారు..
అవేమిటో తెలుసుకోవాలని ఆసక్తి..
చెప్పకపోతే.. విసుగు ..కోపం..

ఒకవేళ చెప్పినా ఒకేమాటని తనకి అర్థ అయ్యేవరకూ 
పదిసార్లు చెప్పడంవలన ఉత్పన్నమయ్యే హాస్యం వలన 
నవ్వుకుటున్న వాళ్ళని చూసి తనకూ నవ్వు
తనగురించే మాట్లాడుకుంటున్నారేమో అని అనుమానం..

..ఇది సామాన్యుడైన చెవిటివాని గోల
అదే యే మేధావో చెవిటివాడైతే..
వాళ్ళ చెవిటితనంపట్ల వాళ్ళ భావాలు ఎలా వుంటాయో కదా..
 

పుట్టపర్తి మాటల్లో అయితే..
''మళయాళ కవి వల్లత్తోల్ అంటే నాకు చాలా ప్రీతి
ఆ వల్లత్తోళ్ 'బధిరన విలాపం' అనే ఒక ఖండిక రాసినాడు
బహుశా 'నాకు చెవుడు ఉన్నదానివల్ల 

ఆ అభిమానం యేర్పడిందేమో..' అనిపిస్తుంది
 

అతడూ చెవిటివాడు పాపం
'చెవిటివాడి గోడు 'అని ..
చాలా గొప్ప కవిత్వం..
రాసినాడు పాపం
 

అట్లనే గాంధీజీ పైన ఒక కాంపొసిషన్ కూడా రాసినాడు వల్లత్తోళ్
ఇతర యే భాషలోనూ గాంధీజీని గురించి 

అంత గొప్పగా రాసి వుండరేమో ననిపిస్తుంది నాకు..''


కానీ మా అయ్యకు చెవిలో చీము కారటం వలన వచ్చింది..
దానికి మా అమ్మా..
మా అమ్మ గురించి యెంత చెప్పినా తక్కువే..
 

మా తట్టు చీపురులు వేరే విధంగా వుంటాయి..
వానిని మా రాయల సీమలో 'పరక' అంటాం

ఆ  పరక పుల్లలు చాలా నున్నగా వుంటాయి 

చివర్లో ముళ్లతో కూడిన కుచ్చు  వుంటుంది
 

బయట విదిలిస్తే ముళ్ళు రాలిపోతాయి
నున్నటిపరక పుల్లలను ఓ సైజులో విరిచి 
వాటికి పత్తి  చుట్టి 
దాదాపు వంద పుల్లలు అయ్యకు అందుబాటులో పెట్టేది
చెవిలో తీసుకోవాల్సినప్పుడల్లా అయ్య వాటిని ఉపయోగించేవారు..

కాస్త వయసైనాక..
అందరూ కూచుని మాట్లాడుకుంటున్నప్పుడు
మనం ఒకటి చెబితే అయ్యకు ఒకటి వినపడేది..
ఆ మాటలకు అమ్మ యెంత అందంగా గల గలా నవ్వేదో..
అమ్మ నవ్వును అయ్య సంతోషంగా చూసేవారో
 

అయ్య నోటివెంట ఒకమాట వచ్చిన క్షణమే 
అమ్మ దానిని ఆచరణలో పెట్టేది..
యీనాడు.. 

చిన్న చిన్న మాటలకు విడిపోతున్నారు..
ఆత్మ గౌరవమంటున్నారు..
స్వయం ఉపాధి అంటున్నారు.
 
కొంచం రాజీ కొంచం అర్థం చేసుకొనే మనసూ 
తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి..
మన ఇంట్లో మన అన్నో తమ్ముడో దురుసుగా ప్రవర్తిస్తే 

దుర్వ్యసనాలకు లోనైతే వదిలేస్తామా.
కాస్త మారేవరకూ ఓపిక పట్టమా..

రాళ్ళపల్లి వారి అభిప్రాయం